బ్యాంక్‌ క్యాషియర్‌ కహానీ

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:29 AM

వివిధ భాషల్లో విభిన్న చిత్రాలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో...

బ్యాంక్‌ క్యాషియర్‌ కహానీ

వివిధ భాషల్లో విభిన్న చిత్రాలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను రంజాన్‌ సందర్భంగా విడుదల చేశారు. ఇందులో బ్యాంక్‌ క్యాషియర్‌గా ఇంతకుమునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్‌ కనిపించారు. ఒక సాధారణ వ్యక్తి అసాదారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో దుల్కర్‌ పలికిన సంభాణలు, ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి,

Updated Date - Apr 12 , 2024 | 05:29 AM