వెంకీ షూటింగ్‌లో బాలయ్య

ABN , Publish Date - Sep 22 , 2024 | 02:39 AM

అగ్ర హీరోల షూటింగ్స్‌ ఒకేచోట జరుగుతున్నప్పుడు ఒక హీరో సెట్‌కు మరో హీరో వెళ్లడం, సరదాగా కాసేపు గడపడం, సినిమాల గురించి మాట్లాడుకోవడం గతంలో ఓ అలవాటుగా, సంప్రదాయంగా ఉండేది. హీరోల మధ్య ఐకమత్యానికీ...

అగ్ర హీరోల షూటింగ్స్‌ ఒకేచోట జరుగుతున్నప్పుడు ఒక హీరో సెట్‌కు మరో హీరో వెళ్లడం, సరదాగా కాసేపు గడపడం, సినిమాల గురించి మాట్లాడుకోవడం గతంలో ఓ అలవాటుగా, సంప్రదాయంగా ఉండేది. హీరోల మధ్య ఐకమత్యానికీ, స్నేహబంధానికీ అటువంటి సంఘటనలు అద్దం పట్టేవి. చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణ మళ్లీ ఆ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చారు. వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణ ఈ విషయం తెలుసుకుని వెంకటేశ్‌ షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లి సందడి చేశారు. బాలయ్య, వెంకీ మంచి స్నేహితులు. అలాగే అనిల్‌ రావిపూడి బాలయ్యతో ‘భగవంత్‌ కేసరి’ చిత్రం రూపొందించారు. బాలయ్య రాకతో టీమ్‌ చాలా థ్రిల్‌ అయింది.

Updated Date - Sep 22 , 2024 | 02:39 AM