మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nandamuri Balakrishna: షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్న బాలకృష్ణ, ప్రచారానికి శ్రీకారం

ABN, Publish Date - Mar 15 , 2024 | 06:13 PM

బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న NBK109 సినిమా షూటింగ్ నుండి రానున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు బ్రేక్ తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ప్రస్తుతం బాలకృష్ణ పాల్గొంటున్నారు.

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది అని వార్త. దర్శకుడు బాలకృష్ణ, ఇంకా కొంతమంది నటీనటులపై ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా భోగట్టా. ఈ పోరాట సన్నివేశం రేపు శనివారంతో అయిపోనుందని తెలుస్తోంది. దీని తరువాత బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ నుండి ఎన్నికలు అయ్యే సమయం వరకు విరామం తీసుకుంటారని తెలుస్తోంది.

బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈసారి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ నుండి విరామం తీసుకొని ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకనే రేపటి వరకు ఈ సినిమా చిత్రీకరణలో బాలకృష్ణ పాల్గొని ఆదివారం వీలైతే ఒకరోజు విశ్రాంతి తీసుకొని, సోమవారం నుండి హిందూపూర్ వెళ్లనున్నారని తెలుస్తోంది.

అయితే ఇదే సినిమాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ నటించ నున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దుల్కర్ ఈ సినిమాలోకి ఇంకా ఎంటర్ అవలేదని, ఎప్పుడు డేట్స్ ఇస్తారో కూడా తెలియదని, బాలకృష్ణ ఈ సినిమా బ్రేక్ తీసుకున్న సమయంలో దుల్కర్ కనక అంగీకరిస్తే అతనిపై సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే దుల్కర్ ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో కూడా ఇంతవరకు క్లారిటీ లేదని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోందని భోగట్టా. శ్రద్ధ శ్రీనాథ్ బాలకృష్ణ పక్కన నటిస్తోందని ఇంకో వార్త.

Updated Date - Mar 15 , 2024 | 06:40 PM