Balakrishna: తమిళ దర్శకుడు రవికుమార్ పై బాలయ్య అభిమానులు ఫైర్!

ABN , Publish Date - Mar 07 , 2024 | 12:22 PM

బాలకృష్ణతో రెండు సినిమాలు 'జై సింహ', 'రూలర్' వరసగా చేసిన దర్శకుడు కె ఎస్ రవికుమార్. అతనికి దర్శకుడిగా ఎవరూ అవకాశం ఇవ్వని సమయంలో బాలకృష్ణ రెండు సినిమాలు ఇచ్చారని, అటువంటి బాలకృష్ణపై రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాలకృష్ణ అభిమానులు రవికుమార్ పై సామజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు

Balakrishna: తమిళ దర్శకుడు రవికుమార్ పై బాలయ్య అభిమానులు ఫైర్!
Nandamuri Balakrishna and director K S Ravi Kumar

నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో రెండు సినిమాలు వరసగా చేశారు. 2018లో 'జై సింహ' అనే సినిమాకి కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు, ఆ తరువాత మరుసటి సంవత్సరం అంటే 2019లో కూడా కెఎస్ రవికుమార్ తో 'రూలర్' అనే సినిమాకి పనిచేశారు బాలకృష్ణ. అప్పట్లో రవికుమార్ కి దర్శకుడిగా సినిమాలు ఏమీ లేనప్పటికీ బాలకృష్ణ పిలిచి ఈ రెండు సినిమాలు ఛాన్స్ ఇచ్చారని అనుకుంటూ ఉండేవారు. రవికుమార్ ఇప్పుడు దర్శకత్వం కాకుండా నటన మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది. (#Balakrishna)

akhandabalakrishna.jpg

ఇప్పుడు ఇదే రవికుమార్ వార్తల్లో వున్నారు, ఎందుకంటే అతను బాలకృష్ణపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు బాలకృష్ణ అభిమానులు రవికుమార్ పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రవికుమార్ 'గార్డియన్' అనే తమిళ సినిమా మీడియా సమావేశానికి హాజరయి అక్కడ బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి, అందుకని బాలకృష్ణ అభిమానులు రవికుమార్ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ రవికుమార్ బాలకృష్ణ గురించి ఏమ్మన్నారంటే 'షూటింగ్ సమయంలో ఎవరేనా నవ్వితే బాలకృష్ణ కి కోపం వస్తుందని, వెంటనే ఆ నవ్విన వ్యక్తిని పిలిచి కొడతారని' చెప్పారు రవి కుమార్.

అలా ఒకసారి బాలకృష్ణతో సినిమా చేస్తున్నప్పుడు తన సహాయ దర్శకుడు అయిన శరవణన్ ని ఫ్యాన్ తనవైపు తిప్పమన్నాను అని, అతను అనుకోకుండా ఆ ఫ్యాన్ బాలకృష్ణ వేపు తిప్పాడని, ఆ గాలికి బాలకృష్ణ విగ్ ఒక్కసారిగా కదిలిందని, అది చూసి సహాయ దర్శకుడు వెంటనే నవ్వాడు అని చెప్పారు రవికుమార్. అతను నవ్వటం చూసి బాలకృష్ణకి వెంటనే కోపం వచ్చిందని, 'ఎందుకు నవ్వుతున్నావ్' అని గట్టిగా అతనిపై అరిచారని, ఎక్కడ సహాయ దర్శకుడిని కొడతాడో అని నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్లి సర్ది చెప్పాను అని రవికుమార్ చెప్పుకొచ్చారు ఆ సమావేశంలో. అయినా కూడా బాలకృష్ణ వినలేదు అని, ఆ సహాయ దర్శకుడిపై అరిచి అక్కడనుంచి వెళ్లిపొమ్మని చెప్పారని రవికుమార్ అప్పుడు జరిగిన సంఘటనలను చెపుతూ బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చారు. ksravikumar.jpg

బాలకృష్ణ అభిమానులు రవి కుమార్ చేసిన వ్యాఖ్యలని తప్పుపట్టారు. బాలకృష్ణ వ్యక్తిత్వం తెలిసినవాళ్ళు ఎవరూ అలా మాట్లాడరని, ఎందుకంటే రవికుమార్ కి సినిమాలు ఎవరూ ఇవ్వనటువంటి సమయంలో బాలకృష్ణ పిలిచి మరీ అతనితో రెండు సినిమాలకి దర్శకత్వం ఇప్పించారని, అటువంటి బాలకృష్ణపై రవికుమార్ ఆలా వ్యాఖ్యలు చెయ్యడం తగదని అభిమానులు అంటున్నారు. దర్శకుడు చెప్పినట్లు చేసే నటుడు బాలకృష్ణ అని చాలా సందర్భాల్లో చెప్పి, ఇప్పుడు ఇలా వ్యంగంగా మాట్లాడటం వలన బాలకృష్ణ కంటే అతని అభిమానులమైన మాకు ఇంకా ఎక్కువ కోపం వస్తోందని, రవికుమార్ పై సామాజిక మాధ్యమాల్లో బాలకృష్ణ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

Updated Date - Mar 07 , 2024 | 12:56 PM