వరదరాజన్ జీవిత నేపథ్యం
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:39 AM
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తియేన్, సాయి పల్లవి నటించిన మూవీ ‘అమరన్’. కమల్ హాసన్, మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈనెల 31న చిత్రం విడుదలవుతోంది...
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తియేన్, సాయి పల్లవి నటించిన మూవీ ‘అమరన్’. కమల్ హాసన్, మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈనెల 31న చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు నాని థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ట్రైలర్ పరిచయం చేస్తుంది. వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్, అతని భార్యగా సాయి పల్లవి నటించారు. సినీ నటుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు.
ఆ కామెంట్స్ నన్నెంతో బాధించాయి
ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. గ్లామరస్ పాత్రలు చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు ‘తాను కావాలనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు’ చెప్పారు. ‘సినిమాల్లోకి రాకముందు వైద్య విద్య కోసం జార్జియా వెళ్లా. అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నా. డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. కొంతకాలానికి ‘ప్రేమమ్’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలయ్యాక.. టాంగో డ్యాన్స్ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నెగటివ్ కామెంట్స్ చేశారు. అవి నన్నెంతో బాధించాయి. సినిమాల్లో శరీరం కనిపించే దుస్తులు వేసుకోకూడదని నియమంగా పెట్టుకున్నా’ అని సాయి పల్లవి తెలిపారు.