‘బ్యాక్‌డోర్’ దర్శకుడి కొత్త చిత్రం
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:17 AM
‘బ్యాక్‌డోర్’ అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల మన్ననలతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు కర్రి బాలాజీ. ఆయన దర్శకత్వంలో మరో చిత్రాన్ని
‘బ్యాక్‌డోర్’ అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల మన్ననలతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు కర్రి బాలాజీ. ఆయన దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించారు. గతంలో ‘అన్‌స్టాపబుల్’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన రంజిత్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ సినిమా విశేషాలను గురించి వివరిస్తూ ‘రేవ్‌పార్టీలు, పబ్బుల్లో జల్సా చేస్తున్న ఈ తరం యువత ఎలా మత్తులో చిత్తవుతోంది, తమ జీవితాలను నాశనం చేసుకుంటోంది అనే అంశాల చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రం తెరకె క్కుతోంది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేశాం. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తాం’ అని చెప్పారు.