కశ్మీర్‌లో సాంగ్‌ వేసుకున్న బచ్చన్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:48 AM

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌తో సునాహోగా’ ట్యాగ్‌ లైన్‌. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌తో సునాహోగా’ ట్యాగ్‌ లైన్‌. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 90 శాతం పూర్తి చేసుకుంది. తాజాగా, ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘సితార’ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో సాగిన ఈ డ్యూయెట్‌ పాటలోని విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. సాహితీ లిరిక్స్‌ అందించగా, సాకేత్‌ కొమండూరి, సమీర భరద్వాజ్‌ ఆలపించారు. మిక్కీ.జే.మేయర్‌ సంగీతం అందించగా శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకు ఎడిటర్‌: ఉజ్వల్‌కులకర్ణి, డీఓపీ:ఆయనంక బోస్‌.

Updated Date - Jul 11 , 2024 | 04:48 AM