రిలీజ్‌కు సిద్ధమైన బచ్చన్‌

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:37 AM

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌ తో సునాహోగా’ ట్యాగ్‌ లైన్‌. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ.జీ.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు..

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌ తో సునాహోగా’ ట్యాగ్‌ లైన్‌. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ.జీ.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మాస్‌ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సినిమాను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సినిమాలో రవితేజ, బిగ్‌ బీ అమితాబ్‌ ఫ్యాన్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆయన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించనున్నారు. యాక్షన్‌తో కూడుకున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌ అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఉజ్వల్‌ కులకర్ణి, డీఓపీ:ఆయనంక బోస్‌, సంగీతం: మిక్కీ.జే.మేయర్‌.

Updated Date - Jul 22 , 2024 | 03:37 AM