అయ్యో పాపం సారూ...

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:44 AM

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్‌’. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌. ‘పాగల్‌’ ఫేమ్‌ నరేశ్‌ కుప్పిలి దర్శకుడు. చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మాత...

అయ్యో పాపం సారూ...

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్‌’. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌. ‘పాగల్‌’ ఫేమ్‌ నరేశ్‌ కుప్పిలి దర్శకుడు. చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నుంచి ‘అయ్యో పాపం సారూ’ అంటూ సాగే గీతాన్ని యూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటకు సురేశ్‌ బనిశెట్టి సాహిత్యం అందించగా లియోన్‌ జేమ్స్‌ స్వరపరిచారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకుంటాయి. టెక్నికల్‌గా ఈ చిత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంద’న్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌

Updated Date - Feb 05 , 2024 | 02:44 AM