యూత్‌ను ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:25 AM

యదార్థ సంఘటనల ఆధారంగా.. యూత్‌ ఆడియెన్స్‌కు మెప్పించేలా తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పుంగనూరు-500143’...

యూత్‌ను ఆకట్టుకుంటుంది

యదార్థ సంఘటనల ఆధారంగా.. యూత్‌ ఆడియెన్స్‌కు మెప్పించేలా తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పుంగనూరు-500143’. శ్రీనాథ్‌ పులకరం ఈ టీనేజ్‌ లవ్‌ డ్రామాకు దర్శకత్వం వహించగా, భువన్‌రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ప్రణవ్‌ ప్రీతమ్‌, షాజ్ఞశ్రీ వేణున్‌, రామ్‌ పటాస్‌, తేజగౌడ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్‌ పులకరం మాట్లాడుతూ ‘‘ఇందులోని లవ్‌స్టోరీ ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత భువన్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌:కోదాటి పవన్‌కల్యాణ్‌, డీఓపీ: నిఖిల్‌ సురేంద్రన్‌, సంగీతం: కార్తీక్‌ రోడ్రిగజ్‌.

Updated Date - Jun 04 , 2024 | 12:25 AM