ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ముఖ్యం

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:42 AM

సినిమా టికెట్‌ రేట్లు పెంచడం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యమని నిర్మాత డి.సురేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడు తమన్‌, దర్శకుడు గోపిచంద్‌ మలినేనితో కలసి బుధవారం ఉదయం...

సినిమా టికెట్‌ రేట్లు పెంచడం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యమని నిర్మాత డి.సురేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడు తమన్‌, దర్శకుడు గోపిచంద్‌ మలినేనితో కలసి బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం సురేశ్‌బాబు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. వారిని థియేటర్లకు తీసుకువస్తే సినిమా పరిశ్రమ బాగుంటుందని, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు.టికెట్‌ ధరల విషయంలో ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో చర్చించగా సానుకూల స్పందన లభించిందన్నారు. ధరల విషయంలో ఏది కావాలంటే అది చేసుకోమనే వెలుసుబాటు ఇచ్చారని తెలిపారు .భారతీయుడు-2 చిత్రం శుక్రవారం విడుదల కానుందని, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు డిస్ర్టిబ్యూషన్‌ తానే తీసుకున్నట్టు చెప్పారు.

తిరుమల (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 11 , 2024 | 04:42 AM