పరిష్కారం చూపే ప్రయత్నం
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:06 AM
‘మంత్ర’ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘దక్షిణ’. సాయిధన్సిక లీడ్‌రోల్ పోషించారు. ఈ నెల 4న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా...
‘మంత్ర’ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘దక్షిణ’. సాయిధన్సిక లీడ్‌రోల్ పోషించారు. ఈ నెల 4న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తులసీరామ్ మాట్లాడుతూ ‘ఇదొక సూపర్ థ్రిల్లర్. సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేశాం’ అన్నారు. సినిమా ఆసక్తికరంగా ఉంటుంది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సాయిధన్సిక చెప్పారు.