అర్బాజ్‌ఖాన్ కీలక పాత్రలో అశ్విన్‌బాబు సినిమా..
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:41 AM
చిరంజీవి ‘జై చిరంజీవ’, మోహన్‌లాల్ ‘బిగ్ బ్రదర్’ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు అర్బాజ్‌ఖాన్, ఓ తెలుగు సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. అశ్విన్‌బాబు హీరోగా అప్సర్ దర్శకత్వం...
చిరంజీవి ‘జై చిరంజీవ’, మోహన్‌లాల్ ‘బిగ్ బ్రదర్’ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు అర్బాజ్‌ఖాన్, ఓ తెలుగు సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. అశ్విన్‌బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుండటం, ఓ మంచి కథలో ముఖ్య పాత్ర పోషిస్తుండటం చెప్పలేని ఆనందాన్ని ఇస్తోందని అర్బాజ్‌ఖాన్ ఆనందం వెలిబుచ్చారు. ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. మా మొదటి ప్రయత్నంలో అర్బాజ్‌ఖాన్ భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుంది. భారీ సాంకేతిక విలువలతో ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు. దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హైపర్ ఆది, సాయిధీన ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్ బడిస.