Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా కొత్త చిత్రం.. టైటిల్‌తోనే అద‌ర‌గొట్టాడుగా

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:28 PM

అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ ఈ రోజు ప్రకటించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'శివం భజే (Shivam Bhaje) అని టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.

Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా కొత్త చిత్రం.. టైటిల్‌తోనే అద‌ర‌గొట్టాడుగా
Shivam Bhaje

యువ నటుడు అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి (Maheswara Reddy Mooli) నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ ఈ రోజు ప్రకటించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ (Ganga Entertainments) ప్రొడక్షన్ నంబర్ 1గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'శివం భజేస‌ (Shivam Bhaje) అని టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించింది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) కథానాయికగా నటిస్తుంది.

shivam.jpeg

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ హీరోగా ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంగా 'శివం భజే (Shivam Bhaje) తెరకెక్కుతుంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇదని... కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందన్నారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan), తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నార‌ని, ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నామ‌న్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నామ‌ని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు.


దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, " మా కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ 'శివం భజేస‌ (Shivam Bhaje) దొరకడం చాలా సంతోషంగా ఉందని, 80% షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాం అన్నారు. మా హీరో అశ్విన్ బాబు (Ashwin Babu), బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan), నిర్మాత మహేశ్వర రెడ్డి (Maheswara Reddy Mooli) గారు చాలా సహకరించారని, సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాం అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని" అన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 07:28 PM