scorecardresearch

Devaki Nandana Vasudeva: మహేష్ బాబు మేనల్లుడి సినిమా వాయిదా..

ABN , Publish Date - Nov 09 , 2024 | 08:18 PM

నవంబర్ 14 భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ను వాయిదా వేశారు. ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్‌తో పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే..

Devaki Nandana Vasudeva: మహేష్ బాబు మేనల్లుడి సినిమా వాయిదా..
Ashok Galla in Devaki Nandana Vasudeva

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటించిన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) వాయిదా పడింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని భావించారు. అయితే, విడుదల తేదీని ఒక వారం ముందుకు తీసుకెళ్లారు. ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Also Read-కుమారుడి పెళ్లిలో కన్నీటితో కూలబడిన స్టార్ యాక్టర్

శనివారం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ న్యూ రిలీజ్ డేట్‌ని కూడా విడుదల చేశారు. దీంతో ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం నవంబర్ 14న కాకుండా.. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ల కోసం మేకర్స్‌కి ఒక వారం అదనంగా లభిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, గ్లింప్స్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. అశోక్ గల్లాని సరికొత్తగా ప్రజంట్ చేశాయి. ఈ సినిమా అశోక్‌ని మంచి విజయాన్ని ఇస్తుందనేలా అప్పుడే టాక్ కూడా మొదలైంది. (Devaki Nandana Vasudeva New Release Date)


Devaki-Nandana-Vasudeva.jpg

ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమాలో అశోక్ గల్లా కంప్లీట్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్‌లో సూచించినట్లుగా ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డివైన్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించిన ఈ సినిమాకు ‘హనుమాన్’ ఫేమ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్స్‌గా ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ ఇద్దరు పనిచేశారు. తమ్మిరాజు ఎడిటర్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ని శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది.

Also Read-దిగ్గజ సంగీత దర్శకుడికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం తిరిగి స్వాధీనం

Also Read-కేతిక శర్మ: బరువెక్కిన అందాలు.. జారుతున్న హృదయాలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2024 | 08:23 PM