మహిళలకు ఆసరా ఆదిశక్తి

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:41 AM

హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ ‘ఆదిశక్తి’ అనే సేవా సంస్థను శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతున్నారు..

మహిళలకు ఆసరా ఆదిశక్తి

హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ ‘ఆదిశక్తి’ అనే సేవా సంస్థను శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతున్నారు. సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆమె ఈ సంస్థను స్థాపించారు. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాలలో మహిళలకు ఆసరాగా నిలవనుందీ సంస్థ. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని. అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ‘ఆదిశక్తి’ సంస్థ ఉద్దేశమని సంయుక్త తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 06:41 AM