నీ జతగా

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:36 AM

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్‌ సెలెబ్రిటీ’ చిత్రంలోని మెలోడీ సాంగ్‌ను హీరో గోపీచంద్‌ విడుదల చేసి కొత్త హీరోకు, యూనిట్‌కు...

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్‌ సెలెబ్రిటీ’ చిత్రంలోని మెలోడీ సాంగ్‌ను హీరో గోపీచంద్‌ విడుదల చేసి కొత్త హీరోకు, యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘నీ జతగా’ అంటూ సాగే ఈ పాటను గణేశా రచించగా, జావెద్‌ అలీ పాడారు. వినోద్‌ యాజమాన్య సంగీత దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చందిన రవికిశోర్‌ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్‌.పాండురంగారావు ఈ సినిమాను నిర్మించారు.

Updated Date - Sep 24 , 2024 | 02:36 AM