ఎన్టీఆర్‌కు తండ్రిగా.. ?

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:58 AM

స్సై యూనివర్స్‌ నుంచి వచ్చి హిట్‌ అయిన చిత్రం ‘వార్‌’. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ఆ చిత్రానికి సీక్వెల్‌ ఇప్పుడు రూపొందుతోంది. ఈ సినిమాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు...

ఎన్టీఆర్‌కు తండ్రిగా.. ?

స్సై యూనివర్స్‌ నుంచి వచ్చి హిట్‌ అయిన చిత్రం ‘వార్‌’. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ఆ చిత్రానికి సీక్వెల్‌ ఇప్పుడు రూపొందుతోంది. ఈ సినిమాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఒక కొత్త లుక్‌లో కనిపించడం కోసం ఫిన్లాండ్‌ నుంచి వచ్చిన స్పెషల్‌ ట్రైనర్‌ దగ్గర శిక్షణ పొందనున్నారు ఎన్టీఆర్‌. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కూడా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ తండ్రి పాత్రను ఆయన పోషిస్తారని సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్‌, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా నటిస్తారని అంటున్నారు.

Updated Date - Apr 02 , 2024 | 05:58 AM