మానవస్పర్శ భరించలేని అఘోరాగా..

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:27 AM

విశ్వక్‌సేన్‌ కథానాయకునిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గామి’. కార్తీక్‌ శబరీశ్‌ నిర్మిస్తున్న ఈ అడ్వంచరస్‌ డ్రామాకు చెందిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అఘోరాలా ఉన్న విశ్వక్‌సేన్‌ని చుట్టూ ఉన్న చాలామంది అఘోరాలు...

మానవస్పర్శ భరించలేని అఘోరాగా..

విశ్వక్‌సేన్‌ కథానాయకునిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గామి’. కార్తీక్‌ శబరీశ్‌ నిర్మిస్తున్న ఈ అడ్వంచరస్‌ డ్రామాకు చెందిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అఘోరాలా ఉన్న విశ్వక్‌సేన్‌ని చుట్టూ ఉన్న చాలామంది అఘోరాలు తాకటానికి ప్రయత్నిస్తున్నట్టు ఈ పోస్టర్‌ ఉంది. పోస్టర్‌లాగే పాత్ర కూడా కొత్తగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులో విశ్వక్‌సేన్‌ శంకర్‌ అనే అఘోరాగా కనిపించనున్నారని, మానవస్పర్శను భరించలేని రేర్‌ కండీషన్‌ ఆ పాత్రకు ఉంటుందని, సంఘర్షణలతో కూడుకున్న పాత్ర ఇదని మేకర్స్‌ పేర్కొన్నారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతోన్న చిత్రమిదని, ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో రివీల్‌ చేస్తామని మేకర్స్‌ తెలిపారు. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.జి.అభినయ, హారిక, మహ్మద్‌ సమద్‌ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కెమెరా విశ్వనాథరెడ్డి, రాంపీ నందిగాం, సంగీతం: నరేశ్‌ కుమరన్‌.

Updated Date - Jan 29 , 2024 | 06:27 AM