విలన్‌కు విలన్‌గా

ABN , Publish Date - May 16 , 2024 | 05:25 AM

తనదైన విలనిజంతో వెండితెరపై విజృంభిస్తున్నారు సైఫ్‌ అలీఖాన్‌. పలు పాన్‌ ఇండియా చిత్రాల్లో విలన్‌పాత్రలకు దర్శకులకు ఆయన తొలి ప్రాధాన్యంగా మారారు...

విలన్‌కు విలన్‌గా

తనదైన విలనిజంతో వెండితెరపై విజృంభిస్తున్నారు సైఫ్‌ అలీఖాన్‌. పలు పాన్‌ ఇండియా చిత్రాల్లో విలన్‌పాత్రలకు దర్శకులకు ఆయన తొలి ప్రాధాన్యంగా మారారు. అయితే ఇప్పుడాయన తన పంథా మార్చి మరోసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌తో ఆయన ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ థ్రిల్లర్‌ చిత్రంలో సైఫ్‌ అంధుడిపాత్రలో కనిపించనున్నారు. జులైలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన ప్రియదర్శన్‌ నటీనటుల ఎంపికపై దృష్టి సారించారట. ‘యానిమల్‌’లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీడియోల్‌ను ఈ సినిమాలో ప్రతి నాయక పాత్రకు సంప్రదించగా, ఆయన అంగీకరించారని బాలీవుడ్‌ టాక్‌. కథ, పాత్ర బాగా నచ్చడంతో కష్టమైనా డేట్లు అడ్జస్ట్‌ చేసేందుకు బాబీడియోల్‌ సిద్ధమయ్యారట. ఏకబిగిన సాగే 40 రోజుల షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రియదర్శన్‌ ఉన్నారట.

Updated Date - May 16 , 2024 | 05:25 AM