యువరాణి పాత్రలో...

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:23 AM

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టి కుర్రకారు మది దోచేశారు నభానటేశ్‌. ఆ తర్వాత వరుస ఆఫర్లతో పలు చిత్రాల్లో నటించిన నభా..ఓ ప్రమాదంలో గాయపడి సినిమాలకు...

యువరాణి పాత్రలో...

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టి కుర్రకారు మది దోచేశారు నభానటేశ్‌. ఆ తర్వాత వరుస ఆఫర్లతో పలు చిత్రాల్లో నటించిన నభా..ఓ ప్రమాదంలో గాయపడి సినిమాలకు రెండేళ్లు విరామమిచ్చారు. ఇటీవలే కోలుకున్న ఆమె తిరిగి నటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆమె నిఖిల్‌ సిద్ధార్థ్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభు’లో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో నభా ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ను పోషిస్తున్నారు. చిత్రబృందం గురువారం ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఆమె యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భరత్‌కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో నిఖిల్‌ పోరాట యోధుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన గుర్రపుస్వారీ, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం విశేషం.

Updated Date - Apr 05 , 2024 | 03:23 AM