ఫియర్‌కు వేదికగా

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:35 AM

హీరోయిన్‌ వేదిక లీడ్‌రోల్‌లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫియర్‌’. హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్‌ అభి నిర్మిస్తున్నారు. అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో...

ఫియర్‌కు వేదికగా

హీరోయిన్‌ వేదిక లీడ్‌రోల్‌లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫియర్‌’. హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్‌ అభి నిర్మిస్తున్నారు. అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైంది. తొలిషాట్‌కు దర్శకుడు కరుణాకర్‌ క్లాప్‌ ఇచ్చారు. నటుడు మురళీమోహన్‌ స్ర్కిప్ట్‌ను యూనిట్‌కు అందించారు. ఈ సందర్భంగా వేదిక మాట్లాడుతూ ‘సస్పెన్స్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా మా దర్శకురాలు కథ ను తయారుచేశారు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంద’న్నారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ఏడాదిపాటు కష్టపడి కథ తయారుచేసుకున్నాను. వేదిక పాత్ర ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘హరిత నా వైఫ్‌. తన సినీరంగం పట్ల ఇష్టం, వివిధ విభాగాలపై అవగాహన ఉన్నాయి. తను ‘ఫియర్‌’తో దర్శకురాలిగా అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. వేదిక ఛాలెంజింగ్‌ రోల్‌ చేస్తున్నారు’ అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేసే అంశాలు చాలా ఉన్నాయని అరవింద్‌ కృష్ణ అన్నారు. పవిత్రా లోకేశ్‌, షాయాజీ షిండే, అనీష్‌ కురువిల్ల కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూ్‌పరూబెన్స్‌. సినిమాటోగ్రఫీ: ఐ అండ్రూ

Updated Date - Jan 18 , 2024 | 05:35 AM