మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లెజెండరీ కోచ్‌ జీవితకథగా...

ABN, Publish Date - Apr 03 , 2024 | 03:13 AM

భారతదేశంలో మోడరన్‌ ఫుట్‌బాల్‌ విప్లవానికి నాంది పలికిన లెజెండరీ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథగా వస్తున్న చిత్రం ‘మైదాన్‌’. అజయ్‌ దేవ్‌గణ్‌ ఇందులో కోచ్‌...

లెజెండరీ కోచ్‌ జీవితకథగా...

భారతదేశంలో మోడరన్‌ ఫుట్‌బాల్‌ విప్లవానికి నాంది పలికిన లెజెండరీ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథగా వస్తున్న చిత్రం ‘మైదాన్‌’. అజయ్‌ దేవ్‌గణ్‌ ఇందులో కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రను పోషిస్తున్నారు. భారతీయ ఫుట్‌బాల్‌ రంగానికి స్వర్ణయుగంగా చెప్పుకునే పదేళ్ల కాలంలో (1952-1962) జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశంలో మోడరన్‌ ఫుట్‌బాల్‌ అటకు ఆద్యుడిగా, నేషనల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌గా, మేనేజర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ చిత్రంలో చూపించనున్నారు. మంగళవారం కథానాయకుడు అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ‘మైదాన్‌’ ఫైనల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫుట్‌బాల్‌ రంగంలో ఇండియా టీమ్‌ చరిత్రను ఎలా తిరగరాసిందో తెలిపే ఈ బయోపిక్‌కు అమిత్‌ రవీంద్రనాథ్‌శర్మ దర్శకత్వం వహించారు. ప్రియమణి, గజ్‌రాయ్‌ రావు, రుద్రనీల్‌ ఘోశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. బోనికపూర్‌ నిర్మించిన ’మైదాన్‌’ ఈ నెల 10న విడుదలవుతోంది.

Updated Date - Apr 03 , 2024 | 03:13 AM