అరుంధతి హాస్యంతో...

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:44 AM

వెన్నెల కిశోర్‌, కమల్‌ కామరాజు ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రానికి ‘ఒసేయ్‌ అరుంధతి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. విక్రాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్‌రెడ్డి...

అరుంధతి హాస్యంతో...

వెన్నెల కిశోర్‌, కమల్‌ కామరాజు ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రానికి ‘ఒసేయ్‌ అరుంధతి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. విక్రాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో ‘ఒసేయ్‌ అరుంధతి’ని నిర్మిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అరుంధతి అనే మధ్య తరగతి ఇల్లాలి కథ ఇది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్న అరుంధతికి ఓ సమస్య ఎదురవుతుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌. సినిమాటోగ్రఫీ: సాయి చైతన్య మాటేటి

Updated Date - Mar 18 , 2024 | 06:44 AM