హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం.. అప్సర రాణి కథానాయికగా కొత్త సినిమా

ABN , Publish Date - Mar 20 , 2024 | 05:41 PM

అరుణ్ ఆదిత్య ,అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కృష్ణబాబు దర్శకత్వం వహిస్తోన్న కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది.

హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం.. అప్సర రాణి కథానాయికగా కొత్త సినిమా
APSARA

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి (Apsara Rani) జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కృష్ణబాబు దర్శకత్వం వహిస్తోన్న కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు M M శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

WhatsApp Image 2024-03-20 at 4.15.51 PM.jpeg

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ''సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉందణ‌ఙ‌, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తామన్నారు. అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు.

WhatsApp Image 2024-03-20 at 4.15.53 PM.jpeg

అప్సర రాణి (Apsara Rani) మాట్లాడుతూ.. మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది, సంతోషంగా ఉందని, నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉందన్నారు. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ M M శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలి షాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమా పాటలు చాలా బాగా వ‌చ్చాయని, అంద‌రిని ఆక‌ట్టుకుంటాయన్నారు.


ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ.. ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసిందని, టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడన్నారు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారని, ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారన్నారు.

WhatsApp Image 2024-03-20 at 4.15.58 PM.jpeg

హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యమని, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబ‌ద్ద‌త‌తో, అంకిత‌భావంతో ప‌ని చేసే వ్య‌క్తి. ఆమె డెడికేష‌న్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుందని తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్ చెప్పారు. ఎంతో ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్న చిత్ర‌యూనిట్ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

Updated Date - Mar 20 , 2024 | 05:41 PM