మే 9నే కల్కి రాక

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:35 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సి. అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది...

మే 9నే కల్కి రాక

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సి. అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ డిజిటల్‌ మీడియాలో వస్తున్న వదంతులపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ స్పందించింది. ముందు ప్రకటించినట్లు మే 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. నేపథ్యంలో వినిపిస్తున్న సంగీతానికి అనుగుణంగా ప్రభాస్‌ పాదం కదుపుతున్న వీడియోను శనివారం మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రభా్‌సకు జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్నారు. కమల్‌హాసన్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 02:35 AM