సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నా

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:45 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో ప్రతినాయకుడిగా అందరినీ మెప్పించిన దేవ్‌గిల్‌.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టేసి, అనేక సార్లు ప్రతినాయకుడి పాత్రలు...

సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నా

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో ప్రతినాయకుడిగా అందరినీ మెప్పించిన దేవ్‌గిల్‌.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టేసి, అనేక సార్లు ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘అహో విక్రమార్క’. ‘మా అబ్బాయి’, ‘రంగుల రాట్నం’ ఫేమ్‌ చిత్ర శుక్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. పేట త్రికోటి దర్శకత్వంలో ఆర్తి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవ్‌గిల్‌ మాట్లాడుతూ ‘‘నన్ను ఇంతవరకూ మీరందరూ విలన్‌ పాత్రల్లోనే చూశారు. కానీ మీ అందరికీ ఈ సినిమాతో నేను సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాను’’ అని చెప్పారు. ‘‘టెక్నికల్‌గా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది’’ అని దేవ్‌గిల్‌ భార్య, నిర్మాత ఆర్తి అన్నారు. ‘‘మంచి సినిమా చేశాం. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలి’’ అని దర్శకుడు పేట త్రికోటి కోరారు.

Updated Date - Jun 21 , 2024 | 12:45 AM