ఆర్కిటెక్ట్‌ నిత్య

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:18 AM

‘మనమే’ చిత్రంతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు శర్వానంద్‌. ఇప్పుడు తన తదుపరి చిత్రం (‘శర్వా 37-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం...

ఆర్కిటెక్ట్‌ నిత్య

‘మనమే’ చిత్రంతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు శర్వానంద్‌. ఇప్పుడు తన తదుపరి చిత్రం (‘శర్వా 37-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ‘ఏజెంట్‌’ చిత్రంలో తన గ్లామర్‌తో అలరించిన సాక్షి వైద్య శర్వాకు జోడీగా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం సాక్షి పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఆమె పాత్రను పరిచయం చేసింది. ఆర్కిటెక్ట్‌ నిత్య పాత్రలో సాక్షి కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తుండగా, జ్ఞానశేఖర్‌ వీఎస్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అజయ్‌ సుంకర సహ నిర్మాత.

Updated Date - Jun 20 , 2024 | 02:18 AM