Talakona: 29న థియేట‌ర్ల‌లోకి.. అప్సర రాణి ఫారెస్ట్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’

ABN , Publish Date - Mar 18 , 2024 | 07:02 PM

అప్సర రాణి ప్రధాన పాత్రలో మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’ . ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

Talakona: 29న థియేట‌ర్ల‌లోకి.. అప్సర రాణి ఫారెస్ట్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’
apsara rani talakona

అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి (Apsara Rani) ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’ (Talakona). ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

apsara.jpeg

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందన్నారు. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విధంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంద‌న్నారు.


aps.jpeg

అంతే కాకుండా ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసామని, అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు .

rani.jpeg

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. అప్సర నటించిన వెరైటీ స్టోరీ ఇదని.. తలకొన (Talakona)లో షూటింగ్ అద్భుతంగా జరిగిందని మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. అప్సర రాణితో పాటు అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కంత్రి తదితరులు ఈ చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 07:02 PM