ప్రశంసలు ఆనందాన్నిస్తున్నాయి
ABN , Publish Date - Sep 19 , 2024 | 06:55 AM
దిలీప్‌ప్రకాశ్, రెజీనా కసాండ్ర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది...
దిలీప్‌ప్రకాశ్, రెజీనా కసాండ్ర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో దిలీప్ ప్రకాశ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘నాటక రంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఇంతటి హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాని చూసిన వారంతా ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు అర్జున్ సాయి అన్నారు.