ప్రశంసలూ.. అవార్డులూ

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:46 AM

పద్మవిభూషణ్‌ గ్రహీత, తెలంగాణ మహా కవి, కాళోజీ నారాయణరావు జీవిత కథగా తెరకెక్కిన చిత్రం ‘ప్రజాకవి కాళోజి’. డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ దర్శకత్వం వహించారు. టైటిల్‌ రోల్‌లో మూల విరాట్‌ (అశోక్‌ రెడ్డి)...

ప్రశంసలూ.. అవార్డులూ

పద్మవిభూషణ్‌ గ్రహీత, తెలంగాణ మహా కవి, కాళోజీ నారాయణరావు జీవిత కథగా తెరకెక్కిన చిత్రం ‘ప్రజాకవి కాళోజి’. డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ దర్శకత్వం వహించారు. టైటిల్‌ రోల్‌లో మూల విరాట్‌ (అశోక్‌ రెడ్డి) నటించారు. విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. గతేడాది ఈ చిత్రం రిలీజైంది. ప్రదర్శితమైన ప్రతీ చోటా విమర్శకుల ప్రశంసలతో పాటూ అవార్డులనూ కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రం ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో ఫీచర్‌ ఫిక్షన్‌ కేటగిరీలో స్పెషల్‌ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ ‘‘గతంలోనూ ఈ చిత్రం పలు అవార్డులు కైవసం చేసుకుంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 18 , 2024 | 06:46 AM