28న చిరంజీవికి ఏఎన్‌ఆర్‌ అవార్డు ప్రదానం

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:51 AM

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈనెల 28న ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ను బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా మెగాస్టార్‌ చిరంజీవికి ప్రదానం

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈనెల 28న ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ను బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా మెగాస్టార్‌ చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు అక్కినేని కుటుంబం తెలిపింది. ఈ మేరకు నాగార్జున చిరంజీవిని స్వయంగా కలసి ఆహ్వానించారు. ‘మా నాన్న ఏఎన్‌ఆర్‌ శత జయంతి వేడుకలు జరుగుతున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ మైలురాయికి గుర్తుగా ఏఎన్‌ఆర్‌ అవార్డ్స్‌ 2024 ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అమితాబ్‌ బచ్చన్‌ అంగీకరించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం!’ అని నాగార్జున తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.

Updated Date - Oct 26 , 2024 | 05:51 AM