Gemini TV: జెమినిలో మ‌రో కొత్త సీరియ‌ల్.. ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Mar 22 , 2024 | 06:24 PM

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమిని టివి . ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమిని టివి .. ఇప్పుడు మ‌రో సరికొత్త సీరియల్ ను మార్చ్ 25 నుంచి ప్రసారం చేయబోతోంది.

Gemini TV: జెమినిలో మ‌రో కొత్త సీరియ‌ల్.. ఎప్ప‌టినుంచంటే
sivangi

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమిని టివి . ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమిని టివి (Gemini TV).. ఇప్పుడు "సివంగి” (Sivangi) అనే సరికొత్త సీరియల్ ను మార్చ్ 25 నుంచి ప్రసారం చేయబోతోంది.

tv.jpeg

ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్ధికంగా సాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. ఊళ్ళో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, సొంత మనిషిలా వెళ్లి సాయపడుతుంది. అక్క పెళ్ళిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని , అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది.


సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి ?. తన అక్క పెళ్లి చేయగలిగిందా ?. తిరిగి తన వూరు వెళ్లగలిగిందా ? అనే ఆసక్తికరమైన పాయింట్తో ఆద్యంత్యం ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ తో సాగనుంది.

gemi.jpeg

ఈ సీరియల్ లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ తదితరులు నటించగా ఈ నెల 25వ తేదీ సోమవారం సా 7:30 గం.లకు జెమిని టివి (Gemini TV). ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సివంగి (Sivangi) సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

Updated Date - Mar 22 , 2024 | 06:24 PM