విజయ్‌ దేవరకొండతో మరో సినిమా

ABN , Publish Date - May 05 , 2024 | 06:30 AM

‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండతో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు దిల్‌ రాజు, శిరీష్‌. ‘రాజావారు రాణివారు’ సినిమాతో పేరు తెచ్చుకున్న...

విజయ్‌ దేవరకొండతో మరో సినిమా

‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండతో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు దిల్‌ రాజు, శిరీష్‌. ‘రాజావారు రాణివారు’ సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రవికిరణ్‌ కోలా ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకొనే ఈ సిసిమాకు సంబంధించిన పూర్తి వివరాలు విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు(మే 9)న వెల్లడిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై రూపుదిద్దుకొనే 59వ చిత్రం ఇది కావడం గమనార్హం.

Updated Date - May 05 , 2024 | 06:30 AM