Suhas: ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

ABN , Publish Date - Mar 30 , 2024 | 02:03 PM

కొత్త దర్శకులకి, నిర్మాతలకి నటుడు సుహాస్ ఒక వరంగా దొరికాడని చెప్పొచ్చు. అతని సినిమాలు చాలా చిత్రీకరణలో, విడుదలకి సిద్ధంగా వున్నాయి. అలాగే ఈరోజు ఇంకొక కొత్త దర్శకుడితో సుహాస్ కొత్త సినిమా 'ఓ భామా అయ్యో రామ' ప్రారంభం అయింది. రామ్ గోదాల దర్శకుడు, ప్రదీప్ రెడ్డి నిర్మాత.

Suhas: ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
Manoj Malavika, Suhas and Anita Hassanandani at the launch of 'Oh Bhama Ayyo Rama'

వైవిధ్య‌మైన చిత్రాల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేకమైన ఒరవడిని సృష్టించుకున్న క‌థానాయ‌కుడు సుహాస్. చిన్న నిర్మాతలకి, కొత్త దర్శకులకి సుహాస్ ఒక కానుకగా దొరికాడని, అదీకాకుండా సుహాస్ కథానాయకుడిగా నటించిన సినిమాలు మంచి విజయాలు అందుకోవటం, సుహాస్ తో సినిమా తీయాలన్న నిర్మాతల సంఖ్య పెరుగుతోంది. అలాగే సుహాస్ చిత్రాల ద్వారా కొత్త దర్శకులు కూడా పరిచయం అవుతున్నారు. సుహాస్ సినిమాలు కొన్ని విడుదలకి సిద్ధం అవుతున్నాయి, కొన్ని చిత్రీకరణలో వున్నాయి, ఈరోజు ఇంకొక కొత్త సినిమా 'ఓ భామ అయ్యో రామ' ప్రారంభం అయింది. ఇదొక వైవిధ్యమైన ప్రేమభరిత సినిమా, ఇందులో వినోదం పాలు కూడా ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు రామ్ గోదాల పరిచయం అవుతున్నారు.

suhasdilraju.jpg

ఈ సినిమాలో సుహాస్ పక్కన మాళ‌విక మ‌నోజ్ కథానాయికగా నటిస్తోంది. గత సంవత్సరం విడుదలైన తమిళ సినిమా 'జో' లో మాళవిక మనోజ్ కథానాయకురాలిగా చేసి తన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఆమె సుహాస్ పక్కన 'ఓ భామ అయ్యో రామ' సినిమాలో చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చిత్రీక‌ర‌ణ పూజా కార్య‌క్ర‌మాలు ఈరోజు (శ‌నివారం) హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రారంభ‌మ‌య్యాయి. హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు, వీరికి కూడా ఇదే మొడ్డతి సినిమా. రామ్ గోదాల ద‌ర్శ‌కుడుగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు.

suhasnewfilmone.jpg

ఈ చిత్ర ప్రధాన జంటపై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ద‌ర్శకుడు వ‌శిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌రో ద‌ర్శ‌కుడు కొల‌ను శైలేష్ బౌండెడ్ స్కిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కులు విజయ్ క‌న‌క‌మేడ‌ల‌,కిషోర్ తిరుమ‌ల‌, నిర్మాత‌ సుద‌ర్శ‌న్ రెడ్డి, ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సుహాస్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు మారుతి గారి ద‌గ్గ‌ర దర్శకత్వ శాఖలో ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి రామ్ తో నాకు ప‌రిచ‌యం వుంది. మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నా అభిమాన న‌టుల‌తో న‌టించే అవ‌కాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్‌కు వెళ‌దామా అని ఎదురుచూస్తున్నాను అన్నారు.

suhasmalavika.jpg

ఈ చిత్రంలో 'నువ్వునేను' ఫేమ్ అనితా హస్సానందని ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆమెకి ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్‌కు అవుతుందని, ఇది ఫ‌ర్ ఫెక్ట్‌గా కుదిరిన చిత్ర‌మని చెప్పారు. ద‌ర్శ‌కుడు రామ్ మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, సుహాస్ కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం చేసే వాళ్ల‌కు దొరికిన వ‌రం. ఎంతో కంఫ‌ర్ట‌బుల్ ఆర్టిస్ట్‌. చాలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సుహాస్ సినిమా చేయ‌డం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా మంచి టెక్నిషియ‌న్స్‌ను ఇచ్చాడు. ర‌థ‌న్ సంగీతం చిత్రానికి అద‌న‌పు బలంగా వుంటుంది అన్నారు.

Updated Date - Mar 30 , 2024 | 02:03 PM