నిర్మాత అయిన మరో దర్శకుడు

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:48 AM

‘నేను లోకల్‌’, ‘సినిమా చూపిస్తా మావా’, ‘ధమాక’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇప్పుడు నిర్మాతగా మారారు. కొత్త వారిని ప్రోత్సహించడం కోసం, కొత్త టాలెంట్‌ను...

నిర్మాత అయిన  మరో దర్శకుడు

‘నేను లోకల్‌’, ‘సినిమా చూపిస్తా మావా’, ‘ధమాక’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇప్పుడు నిర్మాతగా మారారు. కొత్త వారిని ప్రోత్సహించడం కోసం, కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకు రావడం కోసం ఆయన ‘నక్కిన నరేటివ్స్‌’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ నెలకొల్పారు. ఈ బేనర్‌పై ఓ సినిమా కూడా ప్రారంభించేశారు. షూటింగ్‌ దాదాపు పూర్తయిందని నక్కిన చెప్పారు. ‘న్యూ ఏజ్‌ కంటెంట్‌, అందించడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించడానికి స్థాపించిన సంస్థ ఇది. యంగ్‌ ట్యాలెంట్‌తో ఓ సినిమా తీశాను. త్వరలోనే టైటిల్‌, ఫస్ల్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - Feb 05 , 2024 | 02:48 AM