దర్శకుడిగా మరో కొరియోగ్రాఫర్‌

ABN , Publish Date - May 24 , 2024 | 03:16 AM

పలు చిత్రాలకు కొరియోగ్రఫీ నిర్వహించిన సతీశ్‌రాజ్‌ దర్శకుడవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. మూవీ జంక్షన్‌ బేనరుపై ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సంస్థ లోగోను సీనియర్‌ నటుడు మురళీమోహన్‌...

దర్శకుడిగా మరో కొరియోగ్రాఫర్‌

పలు చిత్రాలకు కొరియోగ్రఫీ నిర్వహించిన సతీశ్‌రాజ్‌ దర్శకుడవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. మూవీ జంక్షన్‌ బేనరుపై ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సంస్థ లోగోను సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ ఆవిష్కరించారు. తన ఇష్టదైవం సాయిబాబా కావడంతో ‘శ్రద్ధ.. సబూరి’ పేరుతో రూపొందించిన పాటను కొరియోగ్రాఫర్లు శేఖర్‌ మాస్టర్‌, విజయ్‌ బిన్నీ, నిర్మాత దామోదర ప్రసాద్‌ రిలీజ్‌ చేశారు. మూడు నిముషాల పాటలో మొత్తం కథ అర్థమయ్యేలా చూపించే దర్శకుడే కొరియోగ్రాఫర్‌ అనీ, ప్రతిభావంతుడైన సతీశ్‌రాజ్‌ దర్శకుడిగా మారడం ఆనందదాయకం అనీ మురళీమోహన్‌ చెప్పారు. సభలో పాల్గొన్న అతిధులందరూ దర్శకుడిగా కూడా సతీశ్‌రాజ్‌ విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ శిరీష, నిర్మాత అర్చన కూడా పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 03:16 AM