విఐ ఆనంద్‌తో అనిల్‌ సుంకర మరో చిత్రం

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:55 AM

‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో తాజాగా విజయం పొందిన దర్శకుడు విఐ ఆనంద్‌తో ఆ చిత్ర సమర్పకుడు, నిర్మాత అనిల్‌ సుంకర మరో సినిమా నిర్మించనున్నారు. ఆనంద్‌ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు...

విఐ ఆనంద్‌తో అనిల్‌ సుంకర మరో చిత్రం

‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో తాజాగా విజయం పొందిన దర్శకుడు విఐ ఆనంద్‌తో ఆ చిత్ర సమర్పకుడు, నిర్మాత అనిల్‌ సుంకర మరో సినిమా నిర్మించనున్నారు. ఆనంద్‌ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు అనిల్‌ సుంకర. ‘విఐ ఆనంద్‌ సూపర్‌ నేచురల్‌ అడ్వెంచర్స్‌ చేయడంలో దిట్ట. కొత్త సినిమా కూడా కథ, సెటప్‌ పరంగా యూనిక్‌గా ఉంబోతోంది. ఇందులో హీరో, మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సహ నిర్మాతలు: రాజేశ్‌ దండా, అజయ్‌ సుంకర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిశోర్‌ గరికపాటి, నిర్మాతలు: అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర.

Updated Date - Feb 21 , 2024 | 03:55 AM