Anasuya Bharadwaj: అందమైన అనసూయ ఈసారి చీరలో...

ABN , Publish Date - Jun 25 , 2024 | 11:28 AM

నటి, యాంకర్, టీవీ హోస్ట్ అయిన అనసూయ భరద్వాజ్ ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈసారి చీరలో అందమైన అనసూయ ఫోటోలను, వీడియోని తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది.

Anasuya Bharadwaj: అందమైన అనసూయ ఈసారి చీరలో...
Anasuya Bharadwaj

నటి, యాంకర్, టీవీ హోస్ట్ అయిన అనసూయ ఎప్పుడూ సామజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా వుండే వ్యక్తుల్లో ఒకరు. అటు సామజిక మాధ్యమాల్లో, ఇటు బయటా అనసూయకి ఎంతోమంది అభిమానులు వున్నారు. ముక్కు సూటిగా మాట్లాడే అనసూయ ఏమి చేసినా, ఒక ఫోటో పోస్ట్ చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. (Anasuya is looking gorgeous in a saree)

anasuyainasaree.jpg

ఇప్పుడు అనసూయ తన తాజా ఫోటోలను పోస్ట్ చేసింది. చీరలో ఎంతో అందంగా వున్న అనసూయ ఫోటోలకి పలువురు సెలబ్రెటీలు కూడా కామెంట్స్ చేశారు. నటీమణులు పాయల్ రాజపుత్, పావని గంగి రెడ్డి, గాయత్రీ భార్గవి లాంటి వాలు అనసూయ చీరలో ఎంతో అందంగా ఉందంటూ పొగిడారు. (Anasuya Bharadwaj is looking beautiful and gorgeous in a saree)

anasuyainasaree1.jpg

ఇక నెటిజన్స్ అయితే సరేసరి! వాళ్ళు అనసూయ ఫోటో అనగానే కామెంట్స్ చేస్తూనే వుంటారు. ఈసారి కాదా అనసూయ చాలా బాగుంది అని కామెంట్స్ ఎక్కువమంది చేశారు.

anasuyainasareea.jpg

అనసూయ ఇప్పుడు 'పుష్ప 2' సినిమా చిత్రీకరణలో బిజీగా వుంది. 'పుష్ప' మొదటి పార్టులో అనసూయ ఒక వైవిధ్యమైన పాత్రలో విలన్ గా అదరగొట్టింది. ఇప్పుడు రెండో పార్టులో ఆమె పాత్రని దర్శకుడు సుకుమార్ ఇంకా బాగా తీర్చిదిద్దుతున్నారు అని అంటున్నారు.

anasuyainasareeb.jpg

అలాగే అనసూయ ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నట్టుగా సమాచారం. మలయాళంలో కూడా ఆమధ్య సినిమా చేసిన అనసూయ, ఇప్పుడు ఇటు తెలుగు, అటు తమిళంలో సినిమాలతో బిజీగా ఉంటూ, టీవిలో కూడా కనిపిస్తూ ఉంటుంది.

Updated Date - Jun 25 , 2024 | 11:28 AM