అనంతపురం అమ్మాయి ప్రేమకథ

ABN , Publish Date - May 19 , 2024 | 06:30 AM

అనంతపురం అమ్మాయి సుమయా రెడ్డి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నిర్మాతగా, కథారచయిత్రిగా, హీరోయిన్‌గా ‘డియర్‌ ఉమ’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...

అనంతపురం అమ్మాయి ప్రేమకథ

అనంతపురం అమ్మాయి సుమయా రెడ్డి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నిర్మాతగా, కథారచయిత్రిగా, హీరోయిన్‌గా ‘డియర్‌ ఉమ’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సాయి రాజేశ్‌ మహదేవ్‌ ఈ సినిమాకు దర్శకుడు. సుమయా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌, ‘నీవెవ్వరో’ పాట విడుదల చేశారు. మెలోడీ ట్యూన్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది. నిర్మాతగా తనకు ఇదే తొలి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీస్థాయిలో ఈ ప్రేమకథను నిర్మించారు సుమయా రెడ్డి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Updated Date - May 19 , 2024 | 06:31 AM