ఆనంద్‌ నటన ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - May 31 , 2024 | 01:52 AM

క్రైమ్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘గం గం గణేశా’తో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు ఉదయ్‌ శెట్టి. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేదార్‌ శెలగంశెట్టి...

ఆనంద్‌ నటన ఆకట్టుకుంటుంది

క్రైమ్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘గం గం గణేశా’తో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు ఉదయ్‌ శెట్టి. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్‌ ఉదయ్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో కథానాయకుడి పాత్ర గ్రే షేడ్స్‌లో ఉంటుంది. ఇప్పటివరకూ సాఫ్ట్‌ రోల్స్‌ చేసిన ఆనంద్‌ ఈ పాత్రకు ఫ్రెష్‌నెస్‌ తీసుకువస్తారని అనిపించి ఆయననే హీరోగా ఎంచుకున్నా. సినిమా మొత్తానికి ఆయన పర్ఫామెన్స్‌ స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఈ సినిమా కథ ఓ వినాయకుడి విగ్రహం చుట్టూ నడుస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - May 31 , 2024 | 01:52 AM