ఆనందంగా ఉంది

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:08 AM

తెలుగువారి ఆత్మీయ నటుడు, దివంగత గుమ్మడి వెంకటేశ్వర రావుకు బంధువుగా ఎన్నో అంచనాలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నటుడు నరేన్‌ రామ. తెలుగువారైౖనా, తమిళంలో సినీ కెరీర్‌ను ఆరంభించి...

ఆనందంగా ఉంది

తెలుగువారి ఆత్మీయ నటుడు, దివంగత గుమ్మడి వెంకటేశ్వర రావుకు బంధువుగా ఎన్నో అంచనాలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నటుడు నరేన్‌ రామ. తెలుగువారైౖనా, తమిళంలో సినీ కెరీర్‌ను ఆరంభించి పలు యాడ్స్‌లో, నాలుగు సినిమాల్లో నటించారు. ఈ నెల 29న విడుదలవుతున్న ‘కలియుగం పట్టణంలో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నరేన్‌ రామ మీడియాతో ముచ్చటించారు.

‘‘తెలుగులో నా సినీ ప్రయాణాన్ని ‘కలియుగం పట్టణంలో’ సినిమాతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇందులో నేను ఓ కీలక పాత్రలో నటించాను. ఇది మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌. దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి ఈ సినిమాను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. హీరోహీరోయిన్లు విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్‌ వారి నటనతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌, అమ్మ సాంగ్‌ చాలా బాగా నచ్చాయి. అజయ్‌ అరసాద మంచి మ్యూజిక్‌ అందించారు. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసిన వారందరూ తప్పక ఎంజాయ్‌ చేస్తారు. టీజర్‌, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నేను తెలుగులో డబ్లుహెచ్‌ఓ(హూ) అనే చిత్రంలో, తమిళంలో మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Mar 26 , 2024 | 12:08 AM