ఊహించని కలయిక

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:22 AM

ధనుష్‌, శేఖర్‌ కమ్ముల సినిమా.. నిజంగా పొంతన లేని కాంబినేషన్‌ ఇది. శేఖర్‌కమ్ముల యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌. ధనుష్‌ పక్కా మాస్‌ హీరో. మరి వీరిద్దరికీ ఎలా సెట్‌ అవుతుందనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం...

ఊహించని కలయిక

ధనుష్‌, శేఖర్‌ కమ్ముల సినిమా.. నిజంగా పొంతన లేని కాంబినేషన్‌ ఇది. శేఖర్‌కమ్ముల యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌. ధనుష్‌ పక్కా మాస్‌ హీరో. మరి వీరిద్దరికీ ఎలా సెట్‌ అవుతుందనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ధనుష్‌ 51వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కథానాయికగా రష్మిక మందన్నాను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌ని తీసుకున్నట్టు తెలిసింది. శేఖర్‌ కమ్ముల ‘అనామిక’ సినిమాకు ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. మిగతా అన్ని సినిమాలకూ కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్లతోనే మ్యూజిక్‌ చేయించుకున్నారు శేఖర్‌ కమ్ముల. ధనుష్‌ సినిమాకోసం ఇప్పుడు మళ్లీ స్టార్‌ కంపోజర్‌తో శేఖర్‌ చేతులు కలిపారని తెలిసింది. నిజానికి శేఖర్‌ అభిరుచి వేరు. కొత్తవాళ్లతో అద్భుతమైన సంగీతాన్ని తీసుకున్నారాయన. మరి క్లాస్‌, మాస్‌ తేడా లేకుండా అన్ని తరహా పాటలకూ మ్యూజిక్‌ ఇచ్చే దేవిశ్రీతో ఎలాంటి పాటలు చేయిస్తాడో చూడాలి.

Updated Date - Jan 03 , 2024 | 01:22 AM