ఓ నిరుద్యోగి కథ

ABN , Publish Date - Nov 04 , 2024 | 05:29 AM

విప్లవ్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘ఈసారైనా’. అశ్విని హీరోయిన్‌. ఈనెల 8న సినిమా విడుదలవుతోంది. ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...

విప్లవ్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘ఈసారైనా’. అశ్విని హీరోయిన్‌. ఈనెల 8న సినిమా విడుదలవుతోంది. ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, హీరో విప్లవ్‌ మాట్లాడుతూ ‘కథ అందమైన గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఒక నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ, అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడు అనేది ప్రధాన కథ. ఈ సినిమాకి నేనే డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని. కష్టమైనా అన్నింటినీ మేనేజ్‌ చేశాను’ అని అన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 05:29 AM