‘రాజీనామా’తో మొదలైన రాజీలేని ప్రయాణం
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:55 AM
తన నట జీవితంలోని తొలి మైలురాయిని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కాలేజ్ రోజుల్లో నటుడిగా రంగస్థలంపై అడుగుపెట్టినప్పటి అరుదైన జ్ఞాపకాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు....
తన నట జీవితంలోని తొలి మైలురాయిని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కాలేజ్ రోజుల్లో నటుడిగా రంగస్థలంపై అడుగుపెట్టినప్పటి అరుదైన జ్ఞాపకాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాలేజ్ రోజుల్లో తొలి నాటకంతోనే ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘1974లో నరసాపురం వై.ఎన్.ఎం కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్నా. అప్పుడే తొలిసారి ‘రాజీనామా’ అనే నాటకంలో ఓ వేషం వే శాను. నటుడిగా నాకది తొలి గుర్తింపు. ఆ ఏడాది కాలేజీ తరపున ఇచ్చే ఉత్తమ నటుడి పురస్కారం నాకు దక్కడం ఎనలేని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 1974 నుంచి 2024 వరకూ 50 ఏళ్ల పాటు సాగిన నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్నిచ్చింది’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిరు పేర్కొన్నారు. రాజీనామాతో మొదలైన రాజీలేని ప్రయాణం ఆయనదని మెగాభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.