ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:45 AM

ఇటీవల ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రంతో విజయాన్ని పొందిన హీరో శ్రీవిష్ణు తన కొత్త చిత్రం వివరాలు బుధవారం ప్రకటించారు. ‘సామజవరగమన’ చిత్రంలో ఆయన సరసన నటించిన రెబా జాన్‌..

ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

ఇటీవల ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రంతో విజయాన్ని పొందిన హీరో శ్రీవిష్ణు తన కొత్త చిత్రం వివరాలు బుధవారం ప్రకటించారు. ‘సామజవరగమన’ చిత్రంలో ఆయన సరసన నటించిన రెబా జాన్‌ ఇందులో హీరోయిన్‌. హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికి అరవై శాతం షూటింగ్‌ పూర్తయిందనీ, వీలైనంత త్వరగా మిగిలిన సినిమాను పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఓ ఆసక్తికరమైన అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వీర్‌ ఆర్యన్‌, అయ్యప్ప శర్మ, సుదర్శన్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌.

Updated Date - Apr 18 , 2024 | 06:45 AM