భయపెట్టనున్న వేదిక

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:54 AM

హీరోయిన్‌ వేదిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఫియర్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో హరిత గోగినేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు...

భయపెట్టనున్న వేదిక

హీరోయిన్‌ వేదిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఫియర్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో హరిత గోగినేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. అరవింద్‌ కృష్ణ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్‌ అభి నిర్మిస్తున్నారు. ఆయన ఈ చిత్రం గురించి వివరిస్తూ ‘మా దర్శకురాలికి ఇది తొలి చిత్రమే అయినా ఎంతో క్లారిటీతో ఉండడం వల్ల పక్కాగా ప్లాన్‌ చేసి తక్కువ టైమ్‌లో సింగిల్‌ షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు. జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, అనిష్‌ కురివిల్లా, షాయాజీ షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్‌, సంగీత: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూ, కో ప్రొడ్యూసర్స్‌: సుజాత రెడ్డి, సురేందర్‌ రెడ్డి.

Updated Date - Feb 19 , 2024 | 02:54 AM