మెప్పించే ముఖ్య గమనిక

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:47 AM

విరాన్‌ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘ముఖ్య గమనిక’. వేణు మురళీధర్‌ వి. దర్శకత్వంలో రాజశేఖర్‌, సాయికృష్ణ నిర్మించారు. ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం...

మెప్పించే ముఖ్య గమనిక

విరాన్‌ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘ముఖ్య గమనిక’. వేణు మురళీధర్‌ వి. దర్శకత్వంలో రాజశేఖర్‌, సాయికృష్ణ నిర్మించారు. ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘కుటుంబ నేపథ్యాన్ని పక్కనపెట్టి తన కష్టంతో పైకి రావాలనుకుంటున్నాడు విరాన్‌. ఈ సినిమాతో ఆయన సక్సెస్‌ కొట్టాలి’ అని ఆకాంక్షించారు. విరాన్‌ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ నాకు అందించిన సహకారం మరువలేనిది’ అన్నారు. వేణు మురళీధర్‌ మాట్లాడుతూ ‘విరాన్‌, లావణ్య జంట ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ. కిరణ్‌ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది’ అని చెప్పారు.

Updated Date - Feb 21 , 2024 | 03:47 AM