ఆకట్టుకునే నాన్న కథ
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:05 AM
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించారు. ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ను మహేశ్‌బాబు...
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించారు. ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ను మహేశ్‌బాబు విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కన్నతండ్రి, పెంచిన తండ్రి ప్రేమను పొందేందుకు కథానాయకుడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి?, ఆ సమస్యను అధిగమించేందుకు అతను ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు అనే అంశం చుట్టూ ఆసక్తికరంగా అల్లుకున్న కథ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఆర్నా కథానాయికగా నటిస్తున్నారు. సాయిచంద్, షాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: జై క్రిష్, సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి.