అలరించే అమ్మపాట

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:45 AM

విశ్వ కార్తిక్‌, ఆయుషి పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌ సంయుక్తంగా...

అలరించే అమ్మపాట

విశ్వ కార్తిక్‌, ఆయుషి పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 22న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. సోమవారం దర్శకుడు వశిష్ఠ చేతుల మీదుగా ‘జో జో లాలీ అమ్మ’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. పాట చాలా బావుందని యూనిట్‌ను ఆయన అభినందించారు. ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అజయ్‌ అరసాద స్వరాలు సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్‌ మాధవనేని.

Updated Date - Feb 27 , 2024 | 04:45 AM